ఆన్లైన్లో లో చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న విక్రేతలపై చర్యలు
- August 18, 2017
సాంకేతిక పరిజ్ఞానం పలు సందర్భాలలో అనేక సమస్యలకు కారణమవుతుంది. కింగ్డమ్లో ఆమోదించబాధని మాదకద్రవ్యాలు ఆన్లైన్ లో ఎంచక్కా అమ్ముడవుతున్నాయి. దీంతో స్పందించిన ఆరోగ్య శాఖాధికారులు పలువురు ఆన్లైన్ విక్రేతలపై చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన చర్యలు చేపట్టారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ( ఎన్ హెచ్ ఆర్ ఏ) సీఈఓ డాక్టర్ మరియమ్ అల్ జలామా ఈ సందర్భంగా మాట్లాడుతూ, " సోషల్ మీడియా నెట్వర్క్లలో మాదకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన ఆరు ప్రకటనలను జారీ చేసినవారిపై చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకోన్నారని తెలిపారు. ఆ విధంగా ఉల్లంఘించినవారిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని అవినీతి మరియు ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ కు ఎదుటకు సూచించనున్నట్లు ఆయన ప్రస్తావించారు.వాటిలో ఒక ప్రకటన వైద్యసంబంధితమైన ఉత్పత్తులకు సంబంధించినది కాగా, మరో ఐదు ప్రకటనలలో అనుమతి లేని అనుబంధమైనవని ఆయన అన్నారు. మిగిలినవి వైద్య ఉత్పత్తులు మరియు పరికరాలకు సంబంధించిన ప్రకటనలని డాక్టర్ అల్ జలాహ్మా పేర్కొన్నారు. ఆ యా ప్రకటనల ఉత్పత్తులలో చాలా వరకు లైసెన్స్ లేనివి, అవసరమైన చర్యలకు చట్టపరమైన అధికారులకు సూచించబడతాయి." గర్భస్రావం జరిగేవంటి సంబంధిత మాత్రలను విక్రయిస్తున్న గతంలో ఒక కేసులో ఆన్లైన్ విక్రేతలపై చట్టపరమైన చర్యలు సైతం తీసుకొన్నారు. ఆమోదించబాధని చట్టవిరుద్ధంగా ఆన్ లైన్ లో అమ్ముడవుతున్న మాదకద్రవ్యాలు మరియు మత్తుని కల్గించే మందులు ఉపయోగించి ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకోవాలని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ( ఎన్ హెచ్ ఆర్ ఏ) అధికారులు ఒక సందేశంలో పౌరులు మరియు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







