మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రాజమౌళి ప్రమోషన్

- August 19, 2017 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రాజమౌళి ప్రమోషన్

మెగా ఫ్యామిలీకి, రాజమౌళీకి మధ్య గ్యాప్‌ ఉందంటూ వచ్చిన వార్తలకు ఫుల్‌స్టాప్ పడబోనుంది.  చిరంజీవి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.  చిరు బర్త్‌ డే నాడు ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ సినిమా టైటిల్‌ను మహావీర్‌గా నిర్ణయించిన నేపథ్యంలో మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాకపోయినా ముందునుంచే హైప్ తీసుకువచ్చి మార్కెట్ చేసుకునే యోచనలో ఉంది చిత్ర యూనిట్.  తెలుగులో బాహుబలి తరువాత అంతటి స్థాయిలో ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.  సంగీత దర్శకుడిగా ఎ.ఆర్ రెహ్మాన్, హీరోయిన్‌గా నయన తార, మరో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com