యజమాని ఇంట్లో ఓ పనిమనిషి....డెలివరీ బాయ్ కామవికార చేష్టలు
- August 19, 2017
యజమానులు ఊరెళ్లడంతో ..అదో చక్కని అవకాశంగా మార్చుకొని ఓ పనిమనిషి బాయ్ ఫ్రెండ్ ని అక్కడకు పిలిపించుకొని వలపు తీరా సుఖించింది. ఊళ్లన్నీ తిరిగి సెలవులు పూర్తి కావడంతో స్వగృహానికి చేరుకొన్నగృహ యజమాని గబ్బు కొడుతున్న తన ఇంటిని " ఆ తరహా వాతావరణం " పసిగట్టిన ఆయన కోపోద్రిక్తుడై తన పనిమనిషి అసహజ చర్యపై పోలీసులకు పిర్యాదు చేసాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి కెళితే.. దేశం కానీ దేశం వచ్చి పనిమనిషిగా నాలుగు డబ్బులు పొదుపు చేసుకొని జాగ్రత్తగా జీవించాల్సిన ఆ మహిళ తప్పటడుగు వేసింది. వివాహితైనా..విచ్చలవిడి శృంగారానికి తహ తహలాడి తుదకు జైలు పాలయ్యంది. అబుదాబి నగరంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా విధులు కొనసాగిస్తున్న ఆ మహిళ ఆ ఇంటికి తరచూ వచ్చిపోయే ఓ డెలివరీ బాయ్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం ఎవరికీ తెలియకుండా వ్యవహారాన్ని..వ్యభిచారాన్ని గుట్టుగా నడిపిన ఆమె.. యాజమాని కుటుంబం ఊరు వెళ్లడాన్ని ఓ బ్రహ్మాండమైన అదునుగా భావించింది. ఆమె కామవాంఛలకు కామా లేకుండా మోజు తీర్చుకోవాలనుకొంది . తన ప్రియుడైన డెలివరీ బాయ్‌ను యజమాని ఇంటికి ఆహ్వానించింది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండడంతో లైంగిక కోరికలు తీర్చుకొనేందుకు యజమాని ఇల్లుని ఓ చిన్నసైజ్ " సుఖనివాస్ " లాడ్జ్ గా మార్చేశారు.ఊరి నుంచి ఉత్సాహంగా వచ్చిన యజమాని కుటుంబం.. తమ పదిలంగా చూసుకొనే పొదరింట్లో పనిమనిషి కామవికారాల గుర్తులను అడుగడుగునా గుర్తించి పట్టరాని కోపంతో వెంటనే నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిమనిషి, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా వేరే వ్యక్తిని యజమాని ఇంట్లోకి ఆహ్వానించిన కారణంగా నిందితురాలిపై కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా నిందితుడి వాదన వేరేలా ఉంది. తన తప్పేమీ లేదని నిందితురాలి ఆహ్వానం మేరకే వెళ్లాలని చెబుతున్నాడు. నిందితుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వాదనలు కోర్టులో కొనసాగుతున్నాయి. కోర్టు తీర్పు అనంతరం శిక్షలను అమలు చేయనున్నామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన







