బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కన్నా ప్రభాస్ కే లైక్స్ ఎక్కువ
- August 19, 2017
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ లెవల్ ఓ రేంజ్ లో పెరిగింది. అటు బాలీవుడ్ లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. దేశంలో హిందీ హీరోలకు ఎంత పేరుందో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈమధ్య ఇండియాలో ప్రేక్షకులకు నచ్చిన హీరోలెవరంటూ 2016-2017కి గాను ఓ పాపులర్ మ్యాగ్ జైన్ సర్వే చేసింది. అందులో మిస్టర్ పర్ ఫెక్ట్ ప్రభాస్ టాప్ టెన్ లోకి దూసుకెళ్లాడు. అంతేనా.. టాప్ 5లో ఉండి.. అమీర్ ఖాన్ కన్నా మంచి ప్లేస్ కొట్టేశాడు. అమితాబ్, సల్మాన్, షారూఖ్, అక్షయ్ కుమార్ తరువాత ప్రభాస్ నే ఎక్కువమంది ఇష్టపడ్డారు. అసలే ఆరడుగుల బుల్లెట్. అమ్మాయిల మనసు దోచుకునే నవ మన్మథుడు. అందులోనూ బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. అందుకే.. ప్రభాస్ ను ప్రేక్షకులు నచ్చి, మెచ్చి లైకులు ఫుల్లుగా కొట్టారు. ప్రస్తుతం ప్రభాస్.. సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







