అమెరికాలో అరుదైన స్థానం సంపాదించిన గుంటూరోడు
- August 19, 2017
అమెరికాలో తెలుగుతేజం మెరిసింది. ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా గుంటూరు వాసికి అరుదైన అవకాశం దక్కింది. వర్సిటీలోని వ్యాస్కులర్ సర్జన్ విభాగంలో అమెరికాయేతర వ్యక్తిగా గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని ఎంపికయ్యారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కార్తీక్ న్యూయార్క్‌లోని విల్ కార్నెల్ మెడికల్ కళాశాలలో ఏడాది పాటు ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం ఫిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో వ్యాస్కులర్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. ఏడాదికి రూ.2.08 కోట్ల ప్యాకేజీతో మూడేళ్ల పాటు యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందని ఈ సందర్భంగా కార్తీక్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. మూడేళ్ల అనంతరం తాను అంగీకరిస్తే ఒప్పందాన్ని పొడిగిస్తారన్నారు. మూడేళ్ల తరువాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆస్పత్రి స్థాపించి సేవలు చేయాలని భావిస్తున్నాని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







