ఉగ్రవాద దాడితో దద్దరిల్లిన స్పెయిన్

- August 19, 2017 , by Maagulf
ఉగ్రవాద దాడితో దద్దరిల్లిన స్పెయిన్

స్పెయిన్‌ నగరం బార్సిలోనాలో గురు వారం జరిగిన తీవ్రవాద దాడితో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఇటీవల కాలంలో తీవ్రవాద దాడులకు యూరప్‌ దేశాలు లక్ష్యమవుతున్నప్పటికీ తాజా దాడిలో స్పెయిన్‌ లక్ష్యం కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ దాడికి తమదే బాధ్యత అని ఐసిస్‌ ప్రకటించింది. ఇరాక్‌, సిరియాల్లో తమ కార్యకలాపాలకు అడ్డం వస్తున్న దేశాలపై, ప్రత్యక్షంగా అక్కడి పోరులో భాగస్వాములవుతున్న దేశాలపై ప్రతీ కార చర్య పేరుతో ఐసిస్‌ తీవ్రవాద దాడులకు పాల్ప డుతోంది. ఐసిస్‌పై జరిగే పోరులో స్పెయిన్‌ పాత్ర చాలా పరిమితమైనది. ఐసిస్‌ వ్యతిరేక కూటమిలో, సైనిక చర్యల్లో చేతులు కలిపేందుకు కూడా స్పెయిన్‌ విము ఖత చూపింది. ముప్పు తక్కువగా వుండే పాత్ర పోషిం చడానికే మొగ్గు చూపింది. స్థానిక ఇరాకీ బలగాలకు అవసర మైన శిక్షణ ఇవ్వడం, విదేశాల్లోని ఐసిస్‌కు మద్దతునిచ్చేం దుకు దేశీయంగా జరిగే ప్రయత్నాలను నివారించడం వంటి చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్‌, అమెరికాతో పోలిస్తే ఐసిస్‌పై పోరులో స్పెయిన్‌ది చాలా పరిమితమైన పాత్ర. అయినా ఐసిస్‌ దాడుల జాబితాలో స్పెయిన్‌ చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com