యెమెన్‌లో హింసాకాండ పై ఐరాస ఆందోళన

- August 19, 2017 , by Maagulf
యెమెన్‌లో హింసాకాండ పై ఐరాస ఆందోళన

యెమెన్‌లో హింసాకాండ పెచ్చరిల్లుతోందని, పరిస్థితి క్షీణిస్తోందని ఐక్యరాజ్య సమితి అధికారులు శుక్రవారం హెచ్చరించారు. హుతీ రెబెల్స్‌ అధీనంలో గల ఉత్తర ప్రాంతంలో ఐరాస మానవతా సాయం అందించడానికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం వుందని ఐరాస మానవతాసాయం వ్యవహారాలు చూసే అధికారి స్టీఫెన్‌ ఓ బ్రియాన్‌ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే నౌకలకు ప్రవేశం నిరాకరిస్తున్న యెమెన్‌ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దాదాపు 80శాతం ఆహారపు దిగుమతులు చేరుకునే హుడెడా ఓడరేవుపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com