3 సంవత్సరాలలో సౌదీ గృహ కార్మికులకు 3 లక్షల18 వేల వీసాలు జారీ
- August 20, 2017
రియాద్ : గత మూడు సంవత్సరాలలో, సౌదీ గృహ కార్మికులకు 3 లక్షల18 వేల వీసాలు జారీ చేయబడ్డాయి. వాటిలో 35 శాతం ఫిలిపినోలు, భారతీయులకు జారీ చేయబడ్డాయి. 2016 లో జారీ చేసిన వీసాలు నాటికి 15 శాతం పెరిగి అవి 1 ,173 ,500 2015 నాటికి 995,930 కు చేరుకున్నాయి. 2014 లో 847,927,కన్నా అధికమయినట్లు ఒక నివేదిక ప్రకారం కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. గత మూడేళ్ల కాలంలో 25 శాతం దేశీయ కార్మికులకు రియాద్ అత్యధికంగా వీసాలను జారీ చేసింది. మూడు నెలల పాటు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులలో ఉన్న యాజమాన్య హక్కులు లేదా వ్యక్తులచే కలిగి ఉన్నవారి వద్ద నుంచి వారిని ఆయా గృహాల నుంచి వేరే గృహాలకు బదిలీ చేస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో గృహ కార్మికుల సేవల అమ్మకం లేదా అద్దెలకు ఇస్తామని ప్రకటనలు చేసుకోవడం చట్ట వ్యతిరేకమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటువంటి ఉల్లంఘనలను తాము క్షుణంగా పర్యవేక్షిస్తున్నట్లు, ఆ విధంగా పాల్పడిన వారిని శిక్షకు సూచిస్తూ అందుకు సంబంధించిన అధికారులకు బదిలీ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనలను నిషేధించే విధంగా అందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







