3 సంవత్సరాలలో సౌదీ గృహ కార్మికులకు 3 లక్షల18 వేల వీసాలు జారీ

- August 20, 2017 , by Maagulf
3 సంవత్సరాలలో సౌదీ గృహ కార్మికులకు 3 లక్షల18 వేల వీసాలు జారీ

రియాద్ : గత మూడు సంవత్సరాలలో, సౌదీ గృహ కార్మికులకు 3 లక్షల18 వేల వీసాలు జారీ చేయబడ్డాయి. వాటిలో 35 శాతం ఫిలిపినోలు, భారతీయులకు జారీ చేయబడ్డాయి. 2016 లో జారీ చేసిన వీసాలు  నాటికి 15 శాతం పెరిగి అవి 1 ,173 ,500 2015 నాటికి 995,930 కు చేరుకున్నాయి. 2014 లో 847,927,కన్నా అధికమయినట్లు ఒక నివేదిక ప్రకారం కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. గత మూడేళ్ల కాలంలో 25 శాతం దేశీయ కార్మికులకు రియాద్ అత్యధికంగా వీసాలను జారీ చేసింది.  మూడు నెలల పాటు  తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులలో ఉన్న  యాజమాన్య హక్కులు లేదా వ్యక్తులచే కలిగి ఉన్నవారి వద్ద నుంచి  వారిని  ఆయా గృహాల నుంచి  వేరే గృహాలకు బదిలీ చేస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో గృహ కార్మికుల సేవల అమ్మకం లేదా అద్దెలకు ఇస్తామని  ప్రకటనలు చేసుకోవడం చట్ట వ్యతిరేకమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటువంటి ఉల్లంఘనలను తాము క్షుణంగా పర్యవేక్షిస్తున్నట్లు, ఆ విధంగా పాల్పడిన వారిని  శిక్షకు సూచిస్తూ అందుకు సంబంధించిన అధికారులకు బదిలీ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనలను నిషేధించే విధంగా అందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com