సౌదీ భర్తలు స్వల్ప కారణాలకు భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నారు
- August 21, 2017
శృతులు కలవకపోతే ఆ సంగీతం ఎంత కర్ణకఠోరంగా ఉంటుందో...భార్య భర్తలకు ఒకరి అభిప్రాయాలంటే ఒకరికి ఏనాడు గౌరవం ఉండదో అక్కడ వారి మధ్య స్వల్ప కారణాలే పెద్ద తగాదాలకు దారి తీస్తాయి. ఇటీవల దుబాయ్ దేశంలో విడాకులు తీసుకొంటున్న వారి సంఖ్య సౌదీలో గణనీయంగా పెరుగుతున్నాయి. పెళ్లయి మూడు నెలలు కూడా కాకముందే విడాకుల కోసం క్యూ కడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే స్త్రీలపై ఆగ్రహం వ్యక్తం చేసి విడాకులు తీసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.కొత్తగా పెళ్లయిందని తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడో యువకుడు.. హనీమూన్ ముగిశాక కొత్త కాపురం పెట్టి ఓ రోజు స్నేహితులందరినీ పిలిచాడు. మంచిగా మందు పార్టీ ఏర్పాటు చేయించాడు. చికెన్, మటన్ అన్నింటినీ భార్యతో స్వయంగా వండించాడు. అయితే డైనింగ్ టేబుల్‌పై వంటకాలను చూసిన భర్తకు కోపం నషాళానికొచ్చింది. మేక తల మాంసం కూరను వండలేదేంటని కోపంతో ఊగిపోయాడు. అందరి ముందే తీవ్ర దుర్భాషలాడాడు. ఆ మరుసటి రోజే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చినా.. తాను ఆ మూర్ఖుడితో ఉండలేనని ఆ యువతి తేల్చిచెప్పింది. దీంతో వారిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. కొత్తగా పెళ్లయింది. షాపింగ్‌కు తీసుకెళ్లమని కోరిందా భార్య. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని షాపింగ్‌కు బయలుదేరారు. కారు దిగాక.. తన వెనక రావాల్సిన భార్య.. తనకంటే ముందుగా నడవడం ఆ భర్తకు ఆగ్రహాన్ని తెప్పించింది. షాపింగ్ మోజులో పడి భర్త వెనకే నడవాలన్న విషయాన్ని మర్చిపోయింది. దీంతో అక్కడిక్కడే విడాకులు ఇచ్చేస్తున్నానని తేల్చి చెప్పేశాడా భర్త.. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో విడాకులు ఇవ్వక తప్పలేదు. ఓ సౌదీ యువకుడికి ఇటీవలే పెళ్లయింది. ఇద్దరూ కలిసి హనీమూన్‌కు వెళ్లారు. భార్య కాస్త ఉన్నత చదువులు చదవడం, మోడ్రన్ అంటే ఇష్టపడటంతో.. కాళ్లకు ఆభరణాలను (పట్టీల వంటివి) ధరించడం ఆమెకు అలవాటు. అయితే అలాంటివి ఇకపై వేసుకోవద్దని భర్త ఆదేశించాడామెను. అయినా హనీమూన్‌కు వెళ్లిన సమయంలో ఓ రోజు వాటిని వేసుకుంది. దీంతో కోపగించి విడాకుల అంశాన్ని ప్రస్తావించి ఆమెను అక్కడే వదిలేసి వచ్చాడా సౌదీ యువకుడు. ఇలా చిన్న చిన్న అంశాలకే విడాకులు ఇచ్చేస్తున్న సౌదీ పౌరుల సంఖ్య పెరిగిపోతోందని వివాహ పద్దుల నిర్వహణాధికారి హుమూడ్ అల్ శిమ్మారి తెలిపారు. తన పర్మిషన్ లేకుండా పుట్టింటికి వెళ్లి వచ్చిందనీ, పెద్దల ముందు కుర్చీలో కూర్చున్నారనీ, ఇలా చిన్న చిన్న విషయాలకే విడాకులు ఇస్తున్నారని వెల్లడించారు. చిన్న చిన్న కారణాలకే సౌదీలో పెరుగుతున్న విడాకుల కేసులు కఠిన చట్టాలు, స్త్రీలపై ఆంక్షలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాలో నూతన ఒరవడి ఒకటి ఇటీవల మొదలైంది. తల్లిందండ్రులు, మతపెద్దలు యువతకు పెళ్లి, విడాకులు, భార్య.. తదితర విషయాలపై అవగాహన పెంచేలా చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







