ఇక పై రామాయణ, మహాభారతం కోర్సులు హార్వర్డ్ యూనివర్సిటీలో
- August 21, 2017
రామాయణ, మహాభారతాలు ప్రతీ భారతీయుడు దైనందిన జీవితం తో ముడిపడి ఉంటుంది. తరచి చూస్తే.. మన జీవితంలో జరిగే ప్రతి మంచి-చెడు.. వాటి ను మనం ఎలా జీవిటానికి అన్వయించుకోవాలనేది రామాయణ, మహాభారతల్లో ఉంటుంది.. ఇటువంటి గొప్ప విశిష్టత కలిగిన రామాయణ, మహాభారత గ్రంధాలను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కోర్సుల్లో చేర్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రామాయణ భారతలను ఇక్కడ భోధించనున్నట్లు ప్రొఫెసర్స్ తెలిపారు. భారత మత గ్రంధాల ద్వారా సాహిత్య రచన భోధన అనే అంశాన్ని కోర్సుగా చేర్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. రామాయణ మహాభారత ఇతిహాసాల్లో శ్లోకాల రూపంలో వర్ణించిన మత పరిస్థితులను ఈ సిలబస్ లో చేర్చినట్లు అధికారులు చెప్పారు. వేద వ్యాసుడు, వాల్మీకీ చెప్పిన విషయాలను ఆధునిక మత పరిస్థితులకు అనుసంధానించి విద్యార్ధులకు భోధిస్తారు. ద్వేషం ,అసూయ, యుద్ధం వల్ల కలిగే నష్టాలు.. మహాభారతం లో హూందాగా వివరిస్తే.. కుటుంబంలోని ప్రేమ అభిమానాలను రామాయణం తెలియజేస్తుంది అని అన్నారు. అనేక మంది పరిశోధకులు శతాబ్ధాలకు పైగా ఈ గ్రంధాలపై అధ్యయనం చేశారు. భారతీయ శిల్పకళా సంపదను భారత దేశంలో విస్మరిస్తున్నారని ప్రొఫెసర్స్ అన్నారు. ఈ కోర్సు పూర్తి అయ్యాక వీటి గొప్పతనాన్ని అభినందించకుండా ఉండలేరని వ్యాఖ్యానించారు. ఈ గ్రంధాల గొప్పతనాలను తెలిపే విధంగా అభివృద్ధి చేసి హిందూ మత సాంప్రదాయాలను కొత్త పుంతలు తొక్కిస్తామని హార్వర్డ్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







