ప్రభాస్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో
- August 21, 2017
బాహుబలి 2 తర్వాత చాల గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఎట్టకేలకు తన నూతన చిత్రం సాహో షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టుడియోస్ లో దాదాపు 5 కోట్ల రూపాయల వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించి ప్రముఖ టెక్నీషియయన్లతో పాటు బాలీవుడ్ కు చెందిన స్టార్ నటీ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన టీమ్ ఇంతకు ముందే నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి హిందీ నటుల్ని ప్రతి నాయకులుగా ఎంచుకుంది.
వీరితో పాటు ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ ను కూడా సినిమాలోకి తీసుకుంది. జాకీ ష్రాఫ్ గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' లో స్టైలిష్ విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. వచ్చే వారం నుండి ఈయన షూటింగ్లో పాల్గొననున్నారు.
ఈ సినిమా కోసం కొన్ని అండర్ వాటర్ షాట్స్ కూడా ప్లాన్ చేశారు. కథ ప్రకారం సముద్ర గర్భంలో ప్రభాస్ సాహసాలు చేసే సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం ఈమధ్యే టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేశాడు దర్శకుడు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ దుబాయ్ లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







