16 ఏళ్లలో 1,431 సార్లు తిరుమల కొండ ఎక్కిన ఏకైక భక్తుడు ఈయనే గోపాల్ ప్రభు

- August 21, 2017 , by Maagulf
16 ఏళ్లలో 1,431 సార్లు తిరుమల కొండ ఎక్కిన ఏకైక భక్తుడు ఈయనే గోపాల్ ప్రభు

పిలిస్తే పలికే కలియుగ దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి.. రోజు రోజుకో ఉత్సవంతో ఉరేగే స్వామి వైభవాన్ని కన్నులరా వీక్షించాలని కోరుకొని భక్తుడు ఉండడు. ఇక ముఖ్యంగా ఏడు కొండల మీద కొలువైన స్వామి దర్శనం కోసం కాలినడకన వేల మెట్లు ఎక్కి దర్శిస్తారు. అలా కర్ణాటకు చెందిన ఓ భక్తుడు ఇప్పటి వరకూ కాలినడకన 1,431 సార్లు తిరుమల కొడకు ఎక్కిన ఏకైక వ్యక్తిగా రికార్డ్ కెక్కారు. వివరాల్లోకి వెళ్తే...
బెంగళూరుకు చెందిన గోపాల్ ప్రభు (81) శ్రీ వెంటకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఎనిమిది పదుల వయసు.. బై పాస్ సర్జరీ.. సరిగ్గా కనిపించదు.. వినిపించదు.. అయినా కాలినడకన అలిపిరినుంచి తిరుపతి కొండెక్కి శ్రీవైపై ఉన్న భక్తిని చూటుకున్నాడు.. గోపాల్ ప్రభు టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన తిరుమల శ్రీ వారి దర్శనార్ధం 2000 సంవత్సరంలో మొదటి సరిగా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చారు. అప్పటి నుంచి ఈ 16 ఏళ్లలో మొత్తం 1,431 సార్లు తిరుమల కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకొన్నారు.  ఒకే రోజున 5 సార్లు కొండ ఎక్కడం తో పాటు.. 3 రోజుల వ్యవధిలో 13 సార్లు అలిపిరి నుంచి తిరుమల కొండ ఎక్కిన రికార్డ్ కూడా ఏ ఈ భక్తుడి సొంతం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com