మరోసారి నయనతార, హీరో బాలకృష్ణ మధ్య కుదిరిన కెమిస్ట్రీ

- August 21, 2017 , by Maagulf
మరోసారి నయనతార, హీరో బాలకృష్ణ మధ్య కుదిరిన కెమిస్ట్రీ

బాలకృష్ణ, నయనతార జంటగా కలిసి నటించిన సింహా, శ్రీరామరాజ్యం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట వెండతెర పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.  సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ ప్రొడక్షన్ లో  బాలకృష్ణ, నయనతార జంటగా ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో నయనతార పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com