లాస్ఏంజెల్స్ లో భారత సంతతి ఎడిటర్‌పై వేటు
- August 22, 2017
భారత సంతతికి చెందిన ప్రముఖ జర్నలిస్టు, లాస్ఏంజెల్స్ టైమ్స్ ఎడిటర్ దేవన్ మహరాజ్‌పై పత్రిక యాజమాన్యం వేటువేసింది. 28 ఏళ్ల పాటు లాస్ఏంజెల్స్ టైమ్స్‌లో పనిచేస్తున్న మహరాజ్ 2016 నుంచి పత్రిక ఎడిటర్, పబ్లిషర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ ఎడిటర్లను కూడా సంస్ధ నుంచి తొలగించారు.
ట్రినిడాడ్‌కు చెందిన మహరాజ్ 1989 సమ్మర్ ఇంటర్న్‌గా పత్రికలో తన జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం లాస్ఏంజెల్స్, తూర్పు ఆఫ్రికాలో రిపోర్టర్‌గానూ సేవలందించారు. ఆపై అసిస్టెంట్ ఫారెన్ ఎడిటర్, బిజినెస్ ఎడిటర్, మేనేజింగ్ ఎడిటర్ బాధ్యతలను నిర్వర్తించారు. మహరాజ్ సంపాదకత్వంలో పత్రిక మూడు ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్‌లను గెలుచుకోవడం గమనార్హం. డిజిటల్ దిశగా మళ్లే క్రమంలో ఖర్చు తగ్గించుకోవడం కోసమే వీరిపై పత్రిక యాజమాన్యం వేటువేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







