ఎయిర్ఏసియా ఆఫర్ ''7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్''
- August 22, 2017
మలేషియా బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ఏసియా ప్రమోషనల్ స్కీమ్ ప్రారంభించింది. ఈ ప్రమోషనల్ స్కీమ్‌లో పరిమిత కాల వ్యవధిలో ఎంపికచేసిన వన్-వే విమానాలకు టిక్కెట్‌ను రూ.999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ టిక్కెట్ ధరలోనే అన్ని ఛార్జీలు కలిపి ఉంటాయి. ''7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్'' పేరు మీద ఈ ప్రమోషనల్ స్కీమ్‌ను ఎయిర్ఏసియా ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ కింద విమాన ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో చెప్పింది.
ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 26 నుంచి 2018 ఆగస్టు 28 వరకు ప్రయాణాలకు అందుబాటులో ఉంటుంది. వెబ్, ఎయిర్ఏసియా మొబైల్ యాప్ ద్వారా 2017 ఆగస్టు 27 వరకు ఈ 7-డే సేల్ కింద బుకింగ్స్ చేపట్టవచ్చు. ''ప్రమోషనల్ స్కీమ్ కింద అందించే సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ స్కీమ్ వర్తించదు. కొత్త కొనుగోళ్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది'' అని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో తెలిపింది. ఈ ప్రమోషనల్ స్కీమ్ కిందనే భువనేశ్వర్-కోల్కత్తా, గోవా-బెంగళూరు, గౌహతి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మార్గాల టిక్కెట్ ధర రూ.1,099గా ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







