సిరియాలోని అమెరికా దాడుల్లో 42మంది మృతి
- August 22, 2017
సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా నేతృత్వంలోని బలగాలు వైమానిక దాడులు జరిపాయి. రక్కా నగరంపై జరిపిన ఈ దాడుల్లో దాదాపు 42 మంది పౌరులు మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. వీరిలో 19 మంది చిన్నారులతో పాటు 12 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల సిరియాలోని డైర్ అల్‌జోర్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. సిరియాలోని ఉత్తర భాగంలో తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు 2014 నుంచి దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై సిరియా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







