ఫోజు కి ఫిదా అవుతున్న సెలబ్రిటీలు
- August 22, 2017
ప్రస్తుతం గత మూడు రోజులుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. కాగా ఈ ఫోటో ఏమీ హీరోయిన్ లేదా హీరో సెలబ్రెటీల ఫోటో కాదు.. ఓ సామాన్య వ్యక్తి పెట్టిన స్టైల్ .. కు సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు.. ఈ ఫోటో పై ఇప్పటికే బ్రహ్మీ ని.. కామెంట్ ని జత చేసి మన తెలుగు వారు మరింత పాపులర్ తెస్తే.. ఈ ఫోటో లో సామాన్యుడి భంగిమ కు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సలాం చేస్తూ.. గులాం అంటూ తమ అభిప్రాయాలను పంచుకొంటున్నారు.
ఈ ఫోటో కి మొదటగా టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ట్వీట్ తో మొదలవ్వగా.. బాహుబలి లో పాటను స్పూఫ్ చేస్తూ.. పడమర కొండల్లో వొంగిన సూరీడా... అనే కాప్షన్ తో పాటు.. నాగార్జున, బ్రహ్మీ సూపర్ హిట్ కామెడీ స్పూఫ్ ఫోటో 'ఇలా దిగాలని తెలియక ఇన్నేళ్ల నుంచి ఎన్ని పిచ్చి పిచ్చి ఫోటోలు దిగానండి' అనడం తో మరింత హాస్యాస్పదం గా మారింది. ఈ ఫోటో ని టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు..
అంతేకాదు ఈ ఫోటో పై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.. "ఇది చాలా ప్రత్యేకమైన టాలెంట్" అని కామెంట్ చేయగా.. ప్రముఖ హీరోయిన్ హన్సిక ఆ కామెంట్ కు అవును కొంత టాలెంట్ అని రిప్లై ఇచ్చింది.. ఈ ఫోటోని యాంగిల్ ను కట్ చేసి ఎవరి టాలెంట్ కు తగ్గట్లు వారు వాడుతూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







