దోపిడీకి గురైన కారు డ్రైవర్: ఇద్దరి అరెస్ట్
- August 23, 2017
డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం తన కారులో 625,000 సౌదీ రియాల్స్ తీసుకెళుతున్న ఓ వ్యక్తి నుంచి ఆ సొత్తుని దొంగిలించిన కేసులో ఓ బహ్రెయినీ, అలాగే ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియవస్తోంది. బాధితుడు, ముహర్రాక్ పోలీస్ డైరెక్టరేట్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. కారులో వెళుతున్న తనను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు, ఎవరూ లేని ప్రాంతానికి తనను తీసుకెళ్ళి దోపిడీకి పాల్పడ్డారని పిర్యాదులో బాధితుడు పేర్కొనడం జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, పబ్లిక్ ప్రాజిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







