సాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయ వలసదారుడు
- August 23, 2017
భారతీయ వలసదారుడొకరు, సౌదీలో స్పాన్సరర్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాననీ, అక్రమంగా దేశంలో నివసించాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఈ పరిస్థితుల్లో తనకు సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియాకి వచ్చిన ఉదైర్ కురుప్పయ్యా అనే వ్యక్తి, సౌదీకి చెందిన స్పాన్సరర్ దగ్గర 900 సౌదీ రియాల్స్ జీతంతో పనికి కుదిరారు. అయితే కొన్నాళ్ళ క్రితం కురుప్పయ్యా, సౌదీ స్పాన్సరర్ ద్వారా మూడు నెలల విజిట్ వీసాపై బహ్రెయిన్‌కి వచ్చి, అక్కడే ఇరుక్కుపోయారు. మంచి జీవితం ఉంటుందని భావించి సౌదీ అరేబియాకి వెళితే తన పరిస్థితి ఇలా అయిపోయిందంటూ వాపోతున్నారు కురుప్పయ్య. తన వీసాను స్పాన్సరర్ రెన్యువల్ చేయించకపోవడంతో తన మీద 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా పడిందనీ, ఈ పరిస్థితుల్లో సహకరించలేమని ఎంబసీ అధికారులు తెలిపారని కురుప్పయ్య అంటున్నారు. దాతలు సహకరిస్తే తన కష్టాలు తీరుతాయని వాపోతున్నారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







