రష్యా దాడులకు దద్దరిల్లిన సిరియా
- August 23, 2017సిరియాలోని డిర్ ఎల్ జోర్ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా యుద్ధ విమానాలు చేసిన ఈ మెరుపు దాడిలో దాదాపు 200 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు రష్యా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియా సేనలకు సహకారంగా రష్యా.. డిర్ ఎల్ జోర్ నగరంలోని ఐసిస్ తీవ్రవాదుల స్ధావరాలను ముక్కలు చేసి, వారిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.
ఆగష్టు నెలలో ఇప్పటివరకూ 800 ఉగ్రవాదులను రష్యా బలగాలు అంతమొందించాయని చెప్పింది. అంతర్యుద్ధం జరగుతున్న ప్రదేశానికి ఐసిస్ తీవ్రవాదులు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని తెలిపింది. మోసుల్, రక్కా నగరాలపై అమెరికా, రష్యా సేనలు పట్టు సాధించిన అనంతరం డిర్ ఎల్ జోర్ నగరానికి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం