గురువారం ప్రారంభించనున్న మసాక్-షినాస్-ఖాసబ్ సేవలు
- August 23, 2017
ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 'మ్వాసలాట్' గురువారం నుంచి మస్కట్ -షినాస్-ఖాసబ్ మార్గాన్ని ప్రారంభిస్తుంది. ఇది సుల్తానెట్ లో భూమి మరియు సముద్రాన్ని కలిపే మొట్టమొదటి మార్గం. సుల్తానాట్లో రవాణా, నిర్మాణరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. ఆగష్టు 24 వ తేదీ నుండి ఆగస్టు 31 వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఓ ఏకైక అనుభూతి కోసం ఈ కొత్త మస్కట్-ఖాసబ్ మార్గం మరియు ఖాసబ్-మస్కాట్ మార్గంలో ప్రయాణీకులు పరిమిత సీట్లకు ఈ సేవ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సు మరియు ఫెర్రీలను మొదటిసారిగా వినియోగించనున్నారు. ముసణ్డం గవర్నరేట్ పరిధిలో ఉద్యోగులు మరియు నివాసితులు కోసం ప్రత్యేక ధరలు మరియు 3-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 50 శాతం రాయితీని కల్పించనున్నారు. అలాగే మూడేళ్ళ వయస్సు గల పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అల్ అజాబా, అల్ సహబ్ టవర్, అల్ మబాలియా మరియు సోహార్లలోని మెజాసలత్ కార్యాలయాల్లో ఆయా శాఖలలో టికెట్లు లభ్యం కానున్నాయి. మరియు కాల్ సెంటర్ లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. సీట్లు పరిమితమైనందున ముందస్తు టికెట్ల బుకింగ్ 24 గంటల ముందు ప్రయాణానికి చేసుకోవాలని ఈ సందర్బముగా సిఫార్సు చేయబడింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







