కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ నూతన చిత్రం

- October 25, 2015 , by Maagulf
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ నూతన చిత్రం

 ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న నూతన చిత్ర షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌కు ఇది 26వ చిత్రం. 2016 ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 'జనతా గ్యారేజ్‌'(వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరుపొందిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' టీజర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com