భారత యుద్ధ విమానాల్లో మహిళా పైలట్ల నియామక ప్రతిపాదన
- October 25, 2015
మహిళలు త్వరలో యుద్ద విమానాల్లో దూసుకెళ్తూ ధైర్య సాహసాలు చాటనున్నారు. యుద్ధ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్న చిరకాల ప్రతిపాదన అమలు దిశగా తొలి అడుగు పడింది. భారత యుద్ధ విమానాల్లో మహిళా పైలట్ల నియామక ప్రతిపాదనను కేంద్రం శనివారం నాడు ఆమోదించింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్ నుంచి 2016 జూన్ నాటికి మహిళా పైలట్లను నియమించనున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2017 జూన్ నాటికి పూర్తిస్థాయి పైలట్లుగా నియమిస్తారు. వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ద్వారా... సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పని చేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైమానిక అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్లో నుంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపిక చేయనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







