పెళ్ళి పీటలెక్కబోతున్న 'ఆశిన్'
- October 25, 2015
'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరుగనుంది. నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







