తెలంగాణ ప్రజలకు న్యూఇయర్‌కు పెద్ద గిఫ్ట్‌ ఇవ్వబోతున్న కేసీఆర్‌

- August 24, 2017 , by Maagulf
తెలంగాణ ప్రజలకు న్యూఇయర్‌కు పెద్ద గిఫ్ట్‌ ఇవ్వబోతున్న కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూఇయర్‌కు పెద్ద గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని కొత్త సంవత్సర కానుకగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ  ఏడాది డిసెంబరు చివరి నాటికి మిషన్‌ భగీరథ పనులు పూర్తిచేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారులు రేయింబవళ్లు పనిచేయాలని కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఇంటేక్‌ వెల్స్‌ నుంచి నీటిని తీసుకుని.. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా మంచినీటిని పంపింగ్‌ చేయాలని చెప్పారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
మిషన్‌ భగీరథ ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అన్నారు కేసీఆర్‌. అనుకున్న సమయంలో ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించటం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పంతో 43 వేల కోట్ల వ్యయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమన్న సవాల్‌ను తీసుకుని పనులు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షిం చాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం 19 ఇంటెక్‌వెల్స్‌లో ఇప్పటికే 16 పూర్త య్యాయని, మిగతావి త్వరలోనే పూర్తవుతా యని అధికారులు వివరించారు. 50 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 27 పూర్తికావచ్చాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. 43,427 కిలోమీటర్ల పైపులైన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్‌ భగీరథ రూపొందించామని.. అప్పటికి ప్రజలకు సరిపడే నీటిని అందించేలా ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరోసారి మదింపు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని... ప్రతి జిల్లాలో మం త్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com