రజనీకాంత్ రికార్డ్స్ ను పక్కకు నెట్టిన అజిత్
- August 25, 2017
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం (తెలుగు లో వివేకం) నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తమిళనాట అజిత్ ఫ్యాన్స్ సంబరాలు మాములుగా లేవు. శివ - అజిత్ కాంబినేషన్ లో మూడో సినిమా గా వివేగం రావడం బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో థియేటర్స్ దగ్గర పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాచుకుంటున్నారు.
మరోపక్క అజిత్ , సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్స్ ను వివేగం తో చెరిపివేసి, అజిత్ మరోసారి కింగ్ ఆఫ్ ద ఓపెనింగ్ అనిపించుకున్నారు. తొలిరోజున చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల దుమ్మురేపింది. ఇప్పటి వరకు ఓపెనింగ్స్‌లో ముందున్న రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'తెరి' చిత్రాల రికార్డులను (కేవలం చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద) 'వివేకం' వెనక్కినెట్టి.. రూ. 1.21 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఓపెనింగ్ రోజున 'కబాలి' రూ. 1.12 కోట్లు, 'తెరి' రూ. 1.05 కోట్లు రాబట్టాయి.
తాజా వార్తలు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!









