పవన్ - త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2కు
- August 25, 2017
' జల్సా , అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఫై అభిమానుల్లో , సినీ ఇండస్ట్రీ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలకు తగట్టే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. సెప్టెంబర్ 2కు పవన్ 25వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. మీరు పైన చూస్తున్న కళ్లజోడు స్టిల్ ఒకటి రిలీజ్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇలా న్యూస్ బయటకు వచ్చిందో..రాలేదో అంతే ఆ స్టిల్ వైరల్ గా మారింది. దాదాపు 15 నిమిషాల పాటు ఇదే ట్రెండింగ్. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పండగ చేసుకున్నారు. కాకపోతే ఇదంతా జరిగి గంట కూడా కాకముందే అందరికీ షాకిచ్చారు మేకర్స్.
తమ అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి స్టిల్ ను తొలిగించారు. దీంతో అంతా షాక్ అయ్యారు . ఫొటోను తీసేసిన మేకర్స్ కనీసం క్లారిటీ కూడా ఇవ్వకపోవడం అభిమానులు నిరాశను వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







