'అల్లాహూ అక్బర్.. అంటే కాల్చిపారేయండి' అంటున్న వెనిస్ మేయర్
- August 25, 2017
ప్రపంచలోని సుందరమైన ప్రదేశాల్లో ఇటలీలోని వెనిస్ కూడా ఒకటి. ఉగ్రవాద దాడుల నేపధ్యంలో వెనిస్ మేయర్ ఓ సంచలన ప్రకటన చేశారు. నగరంలో ఏ వ్యక్తయినా 'అల్లాహూ అక్బర్' అని అరిస్తే.. అతన్ని అక్కడికక్కడే కాల్చిపారేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నగరానికి వచ్చే వారిపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు.
అందుకు తగిన వనరులన్నింటిని పోలీసులకు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బార్సిలోనా కంటే వెనిస్ చాలా సురక్షితమైన ప్రదేశమని అన్నారు. వెనిస్లోని సెయింట్ మార్క్ స్క్వేర్ వద్ద ఎవరైనా 'అల్లాహూ అక్బర్' అని అరిస్తే.. ఆ వ్యక్తిని నాలుగు సెకన్లలో తమ స్నైపర్లు నేలకూల్చుతారని చెప్పారు. టెర్రిరిస్టులను తాము డైరెక్టుగా అల్లా వద్దకు పంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే









