కమల్ హస్సన్ తో మళ్లీ కలిసి బతకడమా.. నెవర్..నటి గౌతమి
- August 25, 2017కథానాయకుల కాపురాలు కలకాలం నిలవవు. ఎవరు ఎప్పుడు బ్రేకప్ చేబుతారో ఎవరికీ తెలియదు. విడిపోవడానికి వివిధ కారణాలు చూపిస్తారు. అప్పటి వరకు అతను/ఆమెలో కనిపించిన పాజిటివ్స్ అన్నీ ఒక్కసారిగా నెగిటివ్స్గా మారిపోతాయి. పంతాలు, పట్టింపులు కలిసి బతకడానికి అడ్డుగోడలుగా మారిపోతాయి. వారి గురించి ఎవరైనా మాట్లాడితే చిర్రెత్తుతుంటారు. ఇలాంటిదే గౌతమి, కమల్ హాసన్ల జీవితం కూడా. 13 ఏళ్ల తమ అనుబంధాన్ని ఒక్కసారిగా కాదనుకున్నారు. కారణాలు ఏమైతేనం విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటున్నారు. అయితే వీరు మళ్లీ కలిసి జీవించబోతున్నారని కోలీవుడ్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఛానల్ ఏకంగా ఒక వార్తా కథనాన్ని కూడా ప్రసారం చేసింది. ఈ వార్తల్ని గౌతమి ఖండిస్తూ, తీవ్రంగా స్పందించింది. వాస్తవ విషయాల గురించి మాట్లాడమంటూ ఘాటుగా విమర్విస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఆమె నటించిన మళయాళ చిత్రం 'ఈ' ఇటీవల విడుదలైంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









