తన కవితలతో కలల రాకుమారుడు ఫిదా..నటి రేణూ దేశాయ్
- August 26, 2017
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానుల్ని పలకరిస్తుంటుంది. తనకు సంబంధించిన ఏదో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్‌తో అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటుంది. పవన్ తనూ విడిపోయినా తన మాటల ద్వారా పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని,ప్రేమని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తాజాగా రేణు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి కర విషయాలు వెల్లడించింది. చిన్నప్పటి నుంచి తనకు కవితలు, చిన్న చిన్న స్టోరీలు రాసే అలవాటు ఉందని.. కొంత కాలంగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని తెలిపింది. అంతేకాదు తను రాసిన వాటికి ఫస్ట్ రీడర్ పవన్ కళ్యాణ్ అంటూ, పవన్ తనని ఇష్టపడడంతో పాటు, తన రైటింగ్స్ని ఎంతో ప్రోత్సహించేవారని తెలిపారు. 2014 నుంచి కవితలు రాస్తున్నానని, 2015లో తాను అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కవితలు రాశానని, కొంతకాలాని వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేశానని అన్నారు. ప్రస్తుతం మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్న రేణూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో దర్శకురాలిగా, నిర్మాతగా రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









