ఆన్‌లైన్‌లో హజ్‌ యాత్రీకులకు మెట్రో టిక్కెట్స్‌

- August 26, 2017 , by Maagulf
ఆన్‌లైన్‌లో హజ్‌ యాత్రీకులకు మెట్రో టిక్కెట్స్‌

మక్కా రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో హజ్‌ యాత్రీకులకు మెట్రో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించింది. ఐదు కేటగిరీల్లో టిక్కెట్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో కేటగిరీకీ ఒక్కో కలర్‌ని ఫిక్స్‌ చేశారు. మినా 1, ముజ్దాలియా 1 , అరాఫత్‌1 స్టేషన్లకు పర్పుల్‌ టిక్కెట్స్‌, మినా2, ముజ్దాలిఫా 2, అరాఫత్‌ 2 స్టేషన్లకు ఆరెంజ్‌ టిక్కెట్‌, మినా 3, ముజ్దాఫాలియా 3, అరాఫత్‌ 3 స్టేషన్లకు బ్లూ టిక్కెట్‌, బ్రౌన్‌ టిక్కెట్స్‌ అన్ని స్టేషన్లకు తఫ్రీక్‌ పరిధిలో, గ్రీన్‌ టిక్కెట్స్‌ అన్ని స్టేషన్లకీ ఏ టైమ్‌లో అయినా వర్తించేలా ఈ విధానం అమల్లోకి తెచ్చారు. హజ్‌ సందర్బంగా 350,000కి పైగా యాత్రీకులు భద్రతతో కూడిన ప్రయాణం పొందగలరని అధికారిక ప్రతినిథి జలాల్‌ కాకి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com