ఈద్‌ అల్‌ అదా: షార్జా మాల్స్‌లో 80 శాతం డిస్కౌంట్‌

- August 26, 2017 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా: షార్జా మాల్స్‌లో 80 శాతం డిస్కౌంట్‌

షార్జా:ఈద్‌ అల్‌ అదా సెలబ్రేషన్స్‌లో భాగంగా షార్జాలోని పలు మాల్స్‌ 80 శాతం డిస్కౌంట్స్‌ని వివిధ బ్రాండ్స్‌పై మూడు రోజులపాటు అందించనున్నాయి. షార్జా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, షార్జా సమ్మర్‌ గ్రాండ్‌ డిస్కౌంట్స్‌ క్యాంపెయిన్‌ని ప్రకటించింది. ఆగస్ట్‌ 31 రాత్రి వరకు డిస్కౌంట్స్‌తోపాటు మాల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ఇంకో వైపున కార్లు, మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లు, విలువైన కూపన్లు గెలుచుకునే అవకాశం కూడా వినియోగదారులకు ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్లలో వెయ్యికి పైగా రిటైల్‌ షాప్‌లు పాల్గొంటున్నాయి. ఎస్‌సిసిఐ ఎగ్జిబిషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ హన్నా హమమౌద్‌ మాట్లాడుతూ, తొలిసారిగా చాంబర్‌ ద్వారా డిస్కౌంట్స్‌ వివరాల్ని ప్రకటించడం జరిగిందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com