బీహర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎరియల్ సర్వే
- August 26, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను మోదీ పరిశీలించారు. అనంతరం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మోది... బిహార్‌కు వెంటనే 500కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇటీవల బిహార్‌లో భారీ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రజలు వరదల్లో మృతిచెందారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు 2 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల రూపాయల సహాయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







