బీహర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎరియల్ సర్వే

- August 26, 2017 , by Maagulf
బీహర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎరియల్ సర్వే

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను మోదీ పరిశీలించారు. అనంతరం సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన మోది... బిహార్‌కు వెంటనే 500కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇటీవల బిహార్‌లో భారీ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రజలు వరదల్లో మృతిచెందారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు 2 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల రూపాయల సహాయాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com