రాబోయే రెండు రోజులలో ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు

- August 26, 2017 , by Maagulf
రాబోయే రెండు రోజులలో ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. అయితే... ఆ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com