'కబాలి' కుమార్తె ధన్సిక 'వాలుజడ'!
- August 27, 2017
'కబాలి' చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె పాత్ర పోషించిన నటి ధన్సిక. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం 'వాలుజడ'. నివిన్ పౌలీ కథానాయకుడు. రమణ మల్లం దర్శకుడు. సింహ వాహిని చలన చిత్రం, సాయి వైభవి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాధన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో కథానాయిక ధన్సికను మాత్రమే చూపించారు. మరోపక్క ధన్సిక 'సోలో' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







