రవితేజతో లేడీ ఎమ్మెల్యే కేథరిన్

- August 27, 2017 , by Maagulf
రవితేజతో లేడీ ఎమ్మెల్యే కేథరిన్

మాస్ మహారాజ రవితేజ 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలతో బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడట. తమిళంలో ప్రభుదేవా నిర్మించిన 'భోగన్' మూవీని తెలుగులో రవితేజతో రీమేక్ చేయనున్నారట. ఈ తెలుగు రీమేక్‌లో హీరోయిన్‌గా కేథరిన్ పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా.. కేథరిన్ కెరీర్‌కి ఇప్పటివరకూ సరైన బూస్టప్ రాలేదు.
రీసెంట్ హిట్ 'నేనే రాజు.. నేనే మంత్రి'లో నెగటివ్ టచ్ వున్న రోల్లో కనిపించిన కేథరిన్‌కి మంచి మార్కులే పడ్డాయి. అలాగే 'జయ జానకీ నాయక'లో చేసిన ఐటెంసాంగ్ కూడా బాగానే వర్కవుట్ అయింది. 'సరైనోడు' సినిమాతో యంగ్ ఎమ్మెల్యేగా పాపులర్ అయిన కేథరిన్‌కి హీరో రవితేజతో హీరోయిన్‌గా చేసే ఆఫర్ రావడంతో ఈ అమ్మడి కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటున్నారు క్రిటిక్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com