ఆశిష్ రాజ్, సిమ్రాన్‌ల 'ఇగో'

- August 27, 2017 , by Maagulf
ఆశిష్ రాజ్, సిమ్రాన్‌ల 'ఇగో'

"ఆకతాయి" లాంటి మోడరేట్ హిట్ అనంతరం "వికెఎ ఫిలిమ్స్" నిర్మాణ సంస్థ మరో సినిమాను స్టార్ట్ చేసింది. ఈ సినిమా పేరు  "ఇగో".  ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ ఫిల్మ్ లో హీరో సరికొత్తగా ఉండబోతుందిట. విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు హీరోహీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ నవతరం ప్రేమకథకు సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com