రవితేజ తో జత కట్టనున్న లేడీ ఎమ్మెల్యే
- August 27, 2017
క్యాథరిన్ గ్లామర్ డాల్ గానే యువతని ఆకట్టుకొన్నది.. సక్సెస్ ఇప్పుడిప్పుడే అంటుకొంటున్న ఈ భామ నటన లో అంతంత మాత్రమే.. సరైనోడు లో ఎమ్మెల్యేగా నటించిన ఈ హాట్ హాట్ బ్యూటీ ఇటీవలే రిలీజైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నెగిటివ్ షెడ్ క్యారెక్టర్ ని పోషించి.. నటన లో ఫర్వాలేదు అనిపించుకొన్నది.. టాలీవుడ్ లో కేథరిన్ థ్రెసా కెరీర్ ఇప్పుడిప్పుడే సక్సెస్ ట్రాక్ లో వెళుతోంది.
సరైనోడు లో ఎమ్మెల్యే గా నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న క్యాథరిన్ .. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో, ఓ న్యూస్ ఛానల్ హెడ్ పాత్రను.. గ్లామర్ గా పోషించడంలో సక్సెస్ అయింది. అలాగే జయజానకి నాయకలోనూ ఓ స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. దీంతో ఈ గ్లామర్ డాల్ కు గ్లామర్ ప్లస్ పెర్ఫామెన్స్ ఉండే రోల్స్ వస్తున్నాయి.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే చాన్స్ క్యాథరిన్ కు దక్కింది అనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో సక్సెస్ అయిన 'బోగన్' మూవీని తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కించబోతున్నారు. అందులో హీరోయిన్ గా కేథరిన్ ని సెలక్ట్ చేశారు. తమిళ్ వెర్షన్ లో హన్సిక నటించిన ఈ పాత్రలో నటించడానికి కేథరిన్ అంగీకరించింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా సెకండ్ లీడ్ క్యారెక్టర్లే చేస్తున్న కేథరిన్, ఈ మధ్య తన పెర్ఫామెన్స్ తో జనాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతోంది. సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే రీసెంట్ గా గౌతమ్ నంద అంటూ ఓ ఫ్లాప్ కూడా మూట కట్టుకున్నా.. అందులో కూడా ఈ మలయాళీ చేసిన బికినీ షోకు యూత్ ఫిదా అయ్యారు. అందుకే కేథరిన్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న కేథరిన్ 'బోగన్' ఎంత వరకు హెల్ప్ చేస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









