హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం
- August 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్‌ని సిద్ధం చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో పవిత్ర నగరాల్లో యాత్రీకులకు వైద్య చికిత్స అందించేందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట రక్తదాన శిబిరాల్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రక్తాన్ని, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్‌ని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు. మక్కాలో 9 ఆసుపత్రులు, అరాఫత్‌లో 4, మినాలో 4 ఆసుపత్రులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్‌మెంట్‌తో యాత్రీకులకు వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పదిహేడు రీజియన్లు, గవర్నరేట్‌లు, పబ్లిక్, ఐవేట్ మరియు మిలిటరీ సెక్టార్ నుంచి 27 భాగస్వాములు కలిపి మొత్తంగా 16,000 యూనిట్ల రక్తాన్ని సమీకరించడం జరిగింది. రెండు కార్లు, ఐదు టీమ్‌లు బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ కోసం వినియోగిస్తున్నారు. ఇవి అంబులెన్సులకు అదనం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







