టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి

- October 26, 2015 , by Maagulf
టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి

టర్కీలో ఆపరేషన్ ఐఎస్ కొనసాగుతున్నది. సోమవారం ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా, 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ ఉపప్రధాని నుమన్ కుర్తుల్‌మస్ తెలిపారు. ఇటీవల అంకారాలో జరిగిన మానవబాంబు దాడిలో 102మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతఓమైనట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com