ఈ నెల 29న మెగా ఈకామర్స్ ఉద్యోగ మేళా
- October 26, 2015
హైదరాబాద్ బిజినెస్ టు బిజినెస్ పోర్టల్ ఈనెల 29న మెగా ఈకామర్స్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్ కుషలవ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కామర్స్ మార్కెటింగ్, వెబ్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఈవెంట్‌మేనేజ్‌మెంట్, మీడియా రిలేషన్ మేనేజ్‌మెంట్, ఐటీ, ఐటీఈఎస్ ట్రైనీ, హెచ్‌ఆర్ అండ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంట్స్ ట్రైనీ ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాల్గొనడానికి ఇంటర్ లేదా సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. జాబ్‌మేళాలో ఎన్నికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారు. శిక్షణ సమయంలో 8వేల భృతితో పాటు ఇతర అలవెన్స్‌లను ఇస్తామని తెలిపారు. అనంతరం నెలకు 16400 వేతనంతో పాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయన్నారు. ట్రేడ్ హైదరాబాద్ కార్యాలయంలో జరిగే మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. వివరాలకు 7842842539 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







