60,000 బహ్రైన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించండి: ఆసుపత్రికి బహ్రైన్ న్యాయస్థానం ఆదేశం

- October 26, 2015 , by Maagulf
60,000 బహ్రైన్  డాలర్ల నష్టపరిహారం చెల్లించండి: ఆసుపత్రికి బహ్రైన్ న్యాయస్థానం ఆదేశం

వైద్యంలో జరిగిన పొరబాటు వలన ఒక విదేశీ దంపతుల మగ శిశువు మెదడు దెబ్బతిన్న ఘటనలో  ప్రైవేటు ఆసుపత్రిని, మహిళా వైద్యురాని కలిసి 60,000 బహ్రైన్  డాలర్ల నష్టపరిహారం చెల్లించవలసిందిగా, బహ్రైన్  హై అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ నివేదిక, సదరు మహిళా వైద్యురాలు  గర్భవతి ఐన మహిళను  ప్రసవం యొక్క రెండవ దశలో నాలుగు గంటల పాటు పట్టించుకోకుండా వదిలివేసిన పర్యవసానంగా ఆక్సీజన్ లోపం ఏర్పడి బిడ్డ మెదడు కణాలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆ బిడ్డ, దీర్ఘకాలిక సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతూ, శాశ్వత అంగవైకల్యానికి గురైనట్టు కూడా తెలియ వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com