నిర్మాతగా మారబోతున్న హీరో నాని
- August 29, 2017
వరుస విజయాలతో దూసుకెళ్ళేతున్న నాని , తాజాగా నిర్మాత గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో నాని ఓ సినిమా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవల ప్రశాంత్ వర్మ చెప్పిన ఆసకికరమైన కథ నచ్చడంతో నాని ఈ ప్రాజెక్టును నిర్మించాలని అనుకుంటుకున్నారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద నటుల్ని కలవడం జరిగిందని, వాళ్ళు కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నాని వైపు నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటకురాలేదు. నానికి మొదటి నుండి నిర్మాతగా రాణించాలనే కోరిక బలంగా ఉంది. అందుకే ఓ మంచి కథ తో నిర్మాత గా రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఎంసిఏ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే నేను లోకల్ , నిన్ను కోరి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







