హైదరాబాద్ లో మిస్ ఇండియాగా ఎంపికైన ఆర్జే రమ్య

- August 29, 2017 , by Maagulf
హైదరాబాద్ లో మిస్ ఇండియాగా ఎంపికైన ఆర్జే రమ్య

ప్రముఖ మీడియా ఫిల్మ్ శిక్షణ సంస్థ గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ ఇండియా పోటీలు ముగిశాయి. ఈ నెల 24న హైదరాబాద్ లోని అమృతా క్యాజిల్ హోటల్లో గ్రాండ్ ఫైనల్స్ వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ ఫైనల్ పోటీలకు నాయిక రూబీ పరిహార్ జ్యూరీ సభ్యురాలిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాంపు వాక్ లతో మోడళ్లు హొయలెత్తించారు. ముంబైకి చెందిన రితేష్ శెట్టి ఆర్జే మిస్టర్ ఇండియా టైటిల్ ను గెల్చుకోగా...బెంగళూరుకు చెందిన రమ్య ఆర్జే మిస్ ఇండియాగా ఎంపికైంది...ఇతర విజేతల వివరాలు..
నదీమ్ భార్గవ    ఫస్ట్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా (హైదరాబాద్)
పుష్ప              ఫస్ట్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా (శివమొగ్గ)
దేవ్ సూర్య        సెకండ్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా ( చెన్నై)
అమందా డికాజ్  సెకండ్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా ( చిక్ మంగళూరు)
ప్రీతమ్ ఎన్డీ        థర్డ్ రన్నరప్ ఆర్జే మిస్టర్ ఇండియా ( కర్నాటక, మైసూర్)
అసీఫా హాక్       థర్ట్ రన్నరప్ ఆర్జే మిస్ ఇండియా  (అస్సాం )
సత్యేంద్ర త్రిపాఠీ   మిస్టర్ ఇండియా సౌత్ (బెల్గాం)
నాగశ్రీ రామమూర్తి  మిస్ ఇండియా సౌత్, మిస్ యాక్టివ్ 2017

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com