వరల్డ్ నంబర్ వన్ కావడమే లక్ష్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

- August 29, 2017 , by Maagulf
వరల్డ్ నంబర్ వన్ కావడమే లక్ష్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు నగరానికి తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు, తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. కోచ్ , తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ మెడల్ గెలిచానని సింధు వ్యాఖ్యానించింది. స్వర్ణం చేజారడం నిరాశ కలిగించినా... మూడోసారి తన మెడల్ కలర్ మార్చుకుంటానన్న మాట నిలుపుకున్నానని చెప్పింది. అటు సింధు ఆటతీరుపై కోచ్ గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో అద్భుతంగా పోరాడిందని, ఫిట్‌నెస్ లెవెల్స్ మరింత మెరుగైతే తనకు తిరుగుండదని వ్యాఖ్యానించారు. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com