దీనస్థితిలో ఒమాన్ నుండి తెలంగాణకు తెలుగు యువకులు
- August 29, 2017
ఒమాన్: ఒమాన్ దేశంలోని సోహార్ నగరంలో 'పెట్రోన్ గల్ఫ్' అనే కంపెనీ యాజమాన్యం మోసానికి 900 మంది భారతీయ కార్మికులు బలయ్యారు. కంపెనీ మూతపడటంతో కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలురాక, తిండిలేక అలమటిస్తున్నారు. వీరిలో 30 మంది తెలంగాణ, 170 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారున్నారు. గత ఎనిమిది నుండి పదేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న వీరికి నాలుగు నెలల జీతం, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరికి రూ.3 నుంచి 4 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నది. కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి లేబర్ కోర్టులో కేసు పోరాడాడటానికి మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ అధికారం ఇచ్చారు.
ఒమాన్ దేశ రాజధాని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వీరందరికి ఉచిత విమాన టికెట్లు సమకూర్చింది. మంగళవారం (29.08.2017) న మస్కట్ నుండి హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ కు ఇద్దరు, విశాఖపట్నం ఏర్ పోర్ట్ కు 20 మంది వలసకార్మికులు చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చెన్న వెంకటేశ్వర్లు (ఓమాన్ మొబైల్ నెం. +968 9701 3974, ఇండియా మొబైల్ నెం. +91 95506 87385), నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం మెంట్రాజుపల్లి కి చెందిన సంగెమ్ చిన్నయ్య (ఓమాన్ మొబైల్ నెం. +968 9698 3929, ఇండియా మొబైల్ నెం. +91 98498 26805) మస్కట్ నుండి హైదరాబాద్ కు ఒమాన్ ఏర్ వేస్ ప్లయిట్ నెం. WY-235 ద్వారా మంగళవారం ఉదయం చేరుకున్నారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, ప్రోటోకాల్ అధికారులతో కలిసి వీరికి హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో స్వాగతం పలికి, ఓదార్చి ధైర్యం చెప్పారు. తమ సమస్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, ఇండియన్ ఎంబసీ తో సంప్రదింపులు జరిపి స్వదేశానికి రప్పించిన దేవేందర్ రెడ్డికి కార్మికులు కృతఙ్ఞతలు తెలిపారు. వీరు హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి స్వగ్రామాలకు వెళ్ళడానికి తెలంగాణ ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు అందజేశారు.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 20 మంది వలస కార్మికులు సూరపాటి తుంబనాధం, మిట్టన పొట్టయ్య, సీరపు వాసుదేవ్, పైలా గురునాథ్ రెడ్డి, రెయ్యా త్రినాథ్ రెడ్డి, వాసుదేవులు రెడ్డి, గాడి గురుమూర్తి, సేతి మురళి, జెడిల పురుషోత్తం, గోవిందు రామయ్య, బడే కోటేశ్వర్ రావు, యెదురు మోహన రావు, ఎళ్ళుమల్ల వీరాస్వామి, రంగల కురేష్ రెడ్డి, కూన రజయారెడ్డి, దువ్వు గణేష్ రెడ్డి, పేలి డంబారు, కొర్లపు అశోక్ కుమార్, దల్లి మాధవ రెడ్డి, వేణు రెడ్డి లు మస్కట్ నుండి విశాఖపట్నానికి (వయా ముంబయి) ఏయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-651 ద్వారా మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించాలి
కంపెనీ యాజమాన్యం మోసానికి బలై వాపస్ పంపివేయబడ్డ వలసకార్మికులను తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించాలని, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా ఎంపికచేసి ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులకు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందించిన మస్కట్ లోని భారత రాయబారి ఇంద్రామని పాండే కు దేవేందర్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







