స్పైస్ జెట్ వారి సరికొత్త ఆఫర్
- October 27, 2015
దీపావళి సీజన్ దగ్గర పడటంతో.. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. చవక ధరలకు 3 లక్షల టికెట్లను అమ్మకానికి పెట్టింది. స్వదేశీ ప్రయాణాలకు అయితే రూ. 749 నుంచి (పన్నులు కాకుండా), విదేశాలకు అయితే రూ. 3,999 నుంచి టికెట్ల ధరలున్నాయి. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్. ముందుగా వచ్చినవాళ్లకే టికెట్లు ఉంటాయని చెప్పారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి తొమ్మిది నెలల్లోగా ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దీనికి అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారికి ఇది చాలా సౌఖ్యంగా ఉంటుందని అన్నారు. మంగళవారం నుంచి అక్టోబర్ 29 వరకు ఈ చవక టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ కింద ఢిల్లీ నుంచి అమృతసర్, అహ్మదాబాద్, ముంబై నగరాలకు వెళ్లేందుకు రూ. 749 బేస్ ఫేర్‌తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









