జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు

- October 27, 2015 , by Maagulf
జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు

జూనియర్ ఎన్టీఆర్' సరసన అతి లోక సుందరి 'శ్రీదేవి' కూతురు నటిస్తోందన్న పుకార్లు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. 'ఎన్టీఆర్‌', కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్‌' సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్‌గా 'శ్రీదేవి' కూతురు 'జాహ్నవి కపూర్‌'ని ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఎన్టీఆర్‌' సరసన 'శ్రీదేవి' కూతురు నటిస్తుందనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్‌న్యూస్‌గా మారింది. 'మిర్చి', 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ తర్వాత హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్‌ కోసం సమాయత్తమవుతున్న దర్శకుడు కొరటాల శివకు ఈ హాట్‌ న్యూస్‌ కూడా ప్లస్‌ కాబోతోందని టాక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com